అల్లరి నరేష్‌తో సంప్రదింపులు జరగలేదట !

Published on Jun 9, 2019 2:01 pm IST

ఇటీవలే విడుదలై ఘన విజయాన్ని అందుకున్న చిత్రం ‘మహర్షి’. ఇందులో అల్లరి నరేష్ రవి అనే కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆయన నటనకుగాను మంచి ప్రశంసలు అందాయి. దీంతో ఆయనకు ఇలాంటి సపోర్టింగ్ రోల్స్ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని, రవితేజ చేస్తున్న ‘డిస్కో రాజా’లో ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు విఐ ఆనంద్ ఆయన్ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. నరేష్ సైతం నటించడానికి ఒప్ప్పుకున్నట్టు కూడా ప్రచారం మొదలైంది.

కానీ వాస్తవంగా ‘డిస్కో రాజా’ టీమ్ నరేష్‌ను అసలు సంప్రదించలేదని తెలిసింది. కాబట్టి రవితేజ సినిమాలో నరేష్ నటించనున్నారని వార్తకు చెక్ పడింది. నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More