దేవీ మాస్ బీట్స్ తో అద్దిరిపోయిన ‘ఉస్తాద్’ నుంచి సరికొత్త సాంగ్!

దేవీ మాస్ బీట్స్ తో అద్దిరిపోయిన ‘ఉస్తాద్’ నుంచి సరికొత్త సాంగ్!

Published on Mar 12, 2026 5:16 PM IST

UBS 3 1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమానే “ఉస్తాద్ భగత్ సింగ్”. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ లో పవన్ సరసన రాశి ఖన్నా, శ్రీలీల నటిస్తుండగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా మూడో సాంగ్ వచ్చేసింది.

నిన్ననే కాలరే ఎత్తరా అంటూ వచ్చిన ప్రోమో ఒకింత ఓకే అనిపించింది కానీ ఫుల్ సాంగ్ విన్నాక మాత్రం నిన్న పెదవి విరిచిన వారు కూడా హమ్ అయ్యేలా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసారని చెప్పొచ్చు. పక్కా తన మార్క్ మాస్ బీట్స్ తో దేవి అదరగొట్టేస్తే పవన్ తన చార్మింగ్ లుక్స్, సింపుల్ స్టెప్స్ తో డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు.

ఇక ఈ సాంగ్ లో పవన్ తో రాశి ఖన్నా కలిసి స్టెప్పులేయడం విశేషం. అలానే గ్రాండ్ సెటప్, బోలెడుమంది డాన్సర్స్ తో సాంగ్ మరింత నిండుగా థియేటర్స్ లో మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేలా సాగుతుంది అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఇందులో కాసర్ల శ్యామ్ సాహిత్యానికి, రామ్ మిర్యాల గాత్రం మరింత ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. సో మొత్తానికి మాత్రం ఫ్యాన్స్ కి మాస్ ఆడియెన్స్ కి ఈ సాంగ్ ఒక ట్రీట్ గా నిలుస్తుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు