Rashmika Mandanna Legal Action: నా ప్రైవేట్ లైఫ్‌లోకి ఎందుకొస్తున్నారు?.. ట్రోలర్స్‌కు 24 గంటల డెడ్‌లైన్ పెట్టిన నేషనల్ క్రష్!

Rashmika Mandanna Legal Action: నా ప్రైవేట్ లైఫ్‌లోకి ఎందుకొస్తున్నారు?.. ట్రోలర్స్‌కు 24 గంటల డెడ్‌లైన్ పెట్టిన నేషనల్ క్రష్!

Published on Mar 12, 2026 5:01 PM IST

Rashmika-Mandanna

గత కొన్నాళ్ల నుంచి యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్న లవ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణ పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ఆరంభించారు. కానీ మొన్నే పెళ్ళై ఆనందంగా గడపాల్సిన సమయం ఇది కానీ అప్పుడే రష్మికకి కొందరు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇటీవల ఓ ఆడియో కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఇందులో రష్మిక తల్లి, ఎవరితోనో తన కూతురు ఎందుకు తన మాజీ రిలేషన్ షిప్ నుంచి బయటకి వచ్చింది అనేది చెప్పడం జరిగింది. అయితే ఇదే క్లిప్ ని ఇలా రష్మిక పెళ్ళైందో లేదో అప్పుడే కావాలని కొందరు సర్క్యులేట్ చేయడం మొదలు పెట్టారు. దీనితో రష్మిక ఈసారి మాత్రం ఉపేక్షించలేదు.

గత ఎనిమిదేళ్లుగా దాటవేస్తూ వచ్చిన విషయాన్ని నా వరకు అంటే ఊరుకున్నాను కానీ ఇప్పుడు నా కుటుంబీకులు వరకు కూడా వస్తే ఇక మౌనం వహించేది ఉండదు అని అధికారిక ప్రెస్ నోట్ ని విడుదల చేసి హెచ్చరికే ఇచ్చింది. ఎన్నో కామెంట్స్, అవమానాలు తనకి ఈ ఎనిమిదేళ్లలో ఎదురైనప్పటికీ భరించాను అని కానీ ఇప్పుడు సహించేది లేదు అని మూవ్ ఆన్ అయ్యిన తర్వాత కూడా ఇప్పటికీ కొందరు కావాలని టార్గెట్ చేస్తూ కాంట్రవర్సీతో పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారని నేషనల్ క్రష్ మండిపడింది. ఇక ఫైనల్ గా ఎవరైతే తనపై సోషల్ మీడియాలో ఈ ఆడియో ఇతర నెగిటివ్ అంశాలు ప్రచారం చేసారో వారి అందరికీ ఆమె స్ట్రిక్ట్ వార్నింగ్ తో డెడ్ లైన్ పెట్టేసింది.

24 గంటల డెడ్‌లైన్

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లకు రష్మిక సీరియస్ వార్నింగ్ ఇచ్చి తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న ఆ కంటెంట్‌ను, సంబంధిత కథనాలను 24 గంటల్లోగా తొలగించాలని అల్టిమేటం జారీ చేసింది. అలా చేయని పక్షంలో, రేపటి నుంచి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, లీగల్ నోటీసులు పంపుతానని ఫైర్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు