నైజాంలో తన సినిమాని ఓన్ రిలీజ్ చేయనున్న అల్లరి నరేష్

నైజాంలో తన సినిమాని ఓన్ రిలీజ్ చేయనున్న అల్లరి నరేష్

Published on Oct 29, 2014 8:37 AM IST

Allari-Naresh

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమాలో అల్లరి నరేష్ కి బెండు తీసే బ్రదర్ అఫ్ బొమ్మాళి పాత్రలో కార్తీక కనిపించనుంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి హీరోగానే కాకుండా ఈ చిత్ర సమర్పకుడిగా కూడా అల్లరి నరేష్ భాద్యత తీసుకున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా అడుగుపెడుతున్నాడు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అల్లరి నరేష్ నైజాం ఏరియాలో ఓన్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘సుడిగాడు’ తర్వాత అల్లరి నరేష్ మరోసారి మోనాల్ గజ్జర్ తో రొమాన్స్ చేస్తున్న ఈ సినిమాకి చిన్నికృష్ణ డైరెక్టర్. అమ్మిరాజు నిర్మిస్తున్న ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. గత కొద్ది రోజులుగా సరైన హిట్ లేని అల్లరి నరేష్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటానని ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు