‘మహర్షి’ రెస్పెక్ట్ ను ఇచ్చింది – అల్లరి నరేష్

Published on May 12, 2019 5:05 pm IST

అల్లరి నరేష్ ‘మాహర్షి’కి ముందు గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతవుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ‘మహర్షి’ విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ.. మహేష్ కెరీర్ లో నే భారీ హిట్ గా నిలిచింది. అయితే మహర్షి విజయంలో నరేష్ పాత్ర కూడా కీలకంగా ఉండటంతో.. ‘మహర్షి’ వల్ల నరేష్ కి కూడా హిట్ వచ్చినట్లు అయింది.

కాగా ‘మహర్షి’ చిత్రబృందం ఈ రోజు సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘నేను కామెడీ మాత్రమే కాదు, సీరియస్ క్యారెక్టర్ కూడా చేయగలను అని నమ్మి ఈ పాత్రకు నన్ను సెలెక్ట్ చేసిన వంశీగారికి, మహేష్ గారికి కృతజ్ఞతలు.. సినిమా చేస్తున్నంత సేపు చాల బాగా ఎంజాయ్ చేశాను అని తెలిపారు.

నరేష్ ఇంకా మాట్లాడుతూ.. ‘చాల సినిమాలు చేస్తాం. రెస్పెక్ట్ కొన్ని సినిమాలకే వస్తుంది.. మహర్షి అలాంటి రెస్పెక్ట్ ని ఇచ్చింది.. హిట్ మాట విని నాలుగు సంవత్సరాలయ్యింది..ఈ సినిమా తో ఆ మాట విన్నందుకు ఆనందంగా ఉంది. ఈ రోజు ఇక్కడ మా నాన్నగారు లేనందుకు బాధగా ఉంది’ అని చెప్పారు.

సంబంధిత సమాచారం :

More