సీనియర్ దర్శకుడి తో అల్లరి నరేష్ !

Published on May 2, 2019 4:00 am IST

మినిమం గ్యారెంటీ హీరో అల్లరి నరేష్ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుడున్నాడు. సుడిగాడు తరవాత ఆయన నటించిన సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. దాంతో నరేష్ కెరీర్ సందిగ్ధంలో పడింది. ఒకప్పుడు ఏడాది కి 5 లేక 6 సినిమాలతో బిజీ గా వుండే నరేశ్ ఇప్పుడు ఒకటి, రెండు ఆఫర్ల తో సరిపెట్టుకుంటున్నాడు. ఇక తాజాగా ఈ హీరో ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పాడని సమాచారం. అయితే ఈచిత్రం లో నటించే మరో హీరో ఎవరనేది తెలియాల్సి వుంది.

ఇక చాలా కాలం తరువాత సీనియర్ డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి ఈ చిత్రం తో మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్నారు. ఎస్వీఆర్ మీడియా బ్యానర్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :

More