అల్లు అర్జున్ యాక్షన్ డైరెక్టర్ తో ఫిక్స్ అయినట్లే !

Published on Jul 18, 2019 4:03 pm IST

వరుస ఆఫర్స్ తో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే బోయపాటి ‘వినయ విధేయరామ’ ప్లాప్ దెబ్బకి బోయపాటి గత ఐదు నెలల నుండీ సినిమా ప్రయత్నాల్లోనే ఉండిపోయాడు. మొత్తానికి ‘త్వరలోనే తన బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బోయపాటి సినిమాలో హీరో ఎవరు నటిస్తారా అని రకరకాల పేర్లు వినిపించాయి.

కాగా తాజాగా బోయపాటి – అల్లు అరవింద్ కాంబినేషన్ లో వచ్చే మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయినట్లేనట. బోయపాటి శ్రీను – అల్లు అర్జున్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే బోయపాటి – బాలయ్య సినిమా కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. కాకపోతే అల్లు అర్జున్ సినిమా తరువాత వచ్చే ఏడాది బాలయ్యతో సినిమా ఉంటుందన సమాచారం.

సంబంధిత సమాచారం :