భారీ ధరకు క్రాక్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అల్లు అరవింద్!

Published on Jan 24, 2021 10:10 am IST

రవిజేతేజ లేటెస్ట్ సెన్సేషన్ క్రాక్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో డిజిటల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. తీవ్ర పోటీ మధ్య క్రాక్ మూవీని అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఇక క్రాక్ డిజిటల్ రైట్స్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అల్లు అరవింద్ క్రాక్ మూవీ కోసం ఏకంగా రూ. 8.25 చెల్లించారట. తన డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఆహా కోసం క్రాక్ చిత్ర డిజిటల్ రైట్స్ ఆయన దక్కించుకున్నారు. కాగా జనవరి 29నుండి ఆహాలో క్రాక్ స్ట్రీమ్ కానుంది.

ఇలాంటి క్వాలిటీ కంటెంట్ ఉన్న చిత్రాలను సొంతం చేసుకొని పెద్ద మొత్తంలో చందాదారులను పెంచుకోవడానికి అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని క్రాక్ చిత్రాన్ని తెరకెక్కించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సముద్ర ఖని, వరలక్ష్మీ కథలో కీలక రోల్స్ చేయగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. యంగ్ సెన్సేషన్ థమన్ క్రాక్ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :