టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ మరోసారి వార్తల్లో నిలిచారు. సైమా అవార్డుల నామినేషన్స్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రతియేటా నిర్వహించే సైమా అవార్డుల నామినేషన్ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాలకు జాతీయ గుర్తింపు లభిస్తుందని.. ఇప్పటివరకు తెలుగు సినిమాకు 7 జాతీయ అవార్డులు లభించాయని.. ఇది మనందరికీ గర్వకారణమని.. అయితే, జాతీయ అవార్డులు లభించిన చిత్రాలను టాలీవుడ్ గుర్తించకపోయినా, సైమా వాళ్లు గుర్తించారని.. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే ఉందని.. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామని’’ ఆయన అన్నారు.
ఇలా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ కామెంట్స్ ఎలాంటి వివాదానికి దారి తీస్తాయో చూడాలి.


