
పరిచయం అవసరంలేని పేరు అల్లు అర్జున్. తెలుగులో ఎన్నో ట్రెండ్ లను ప్రారంభించాడు. అతని స్టైలిష్ లుక్ లతో, క్లాసీ స్టెప్పులతో ముఖ్యంగా సినిమాల ఎంపికలో అతనికున్న పరిణితితో అతను సూపర్ స్టార్ అనిపించుకున్నాడు
ఇలా ఎంత ఎదిగినా ఒదిగి వుండే మనుషులు మన టాలీవుడ్ లో అరుదుగా లభిస్తూవుంటారు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అయినా ఎటువంటి దర్పంలేకుండా వేదం వంటి సినిమాలో నటించే హీరోలు ఎక్కడ వుంటారు చెప్పండి. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ల ఒరవడికి కొత్తగా శ్రీకారం చుట్టిన సినిమాగా నిలిచిపోతుంది
ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో మల్టీ స్టారర్లకు నాంది పలికిందనే చెప్పాలి. ఇద్దరు హీరోలు వుండే ప్రాజెక్ట్ల వైపు కధా రచయితలు ఆలోచించే విధంగా బన్నీ తీసుకున్న నిర్ణయం మెచ్చుకోదగినది
బన్నీ శరీరఆకృతిని కాపాడుకోవడంలో కూడా దిట్ట. పర్సనల ఫిట్నెస్ ట్రైనర్, 6 ప్యాక్ వంటివి టాలీవుడ్ కి పరిచయం చేసిన నటుడు అల్లు అర్జున్. అతను సిక్స్ ప్యాక్ ని చూసే చాలా మంది టాలీవుడ్ హీరోలు బన్నీని ఫాలో అయ్యారు
ఇవన్నీ మీకు అంతగా ఆసక్తి కలిగించాకపోతే గుణశేఖర్ రుద్రమదేవిలో ప్రత్యేక పాత్ర పోషించడానికి ఒప్పుకున్న బన్నీ నిర్ణయమే మీ ప్రశ్నలకు సమాధానం. రేస్ గుర్రం వంటి బ్లాక్ బస్టర్ తరువాత గెస్ట్ రోల్ చెయ్యడం అంటే మాటలు కాదు
ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు గనుకే బన్నీ సినిమా జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. గంగోత్రిలో పిల్లోడిగా కనిపించి రేస్ గుర్రం లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించేంత వరకూ అతను ఎంత కష్టపడ్డాడో మనకు తెలుస్తుంది
తన సినిమాలో కాస్ట్యుం, కేశాలంకరణ వంటి చిన్న విషయాలలో బన్నీ తీసుకున్న శ్రద్ధని చూస్తే టాలీవుడ్ కి ట్రెండ్ సెట్టర్ అనడం అతిశయోక్తికాదేమో …