భారత ను “శాకుంతలం” సెట్స్ లో కలిసిన “పుష్ప”

Published on Aug 9, 2021 7:25 pm IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళి పండుగ కి విడుదల కానుంది. ఈ చిత్రం ను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు అల్లు అర్జున్ తిరిగి షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హా శాకుంతలం చిత్రం లో ప్రిన్స్ భారత పాత్ర లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే పుష్ప మరియు శాకుంతలం చిత్రాలు ప్రస్తుతం ఒకే లొకేషన్ లో షూటింగ్ లు జరుపుకోవడం తో అల్లు అర్జున్ శాకుంతలం సెట్స్ లోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ మూమెంట్ 15 లేదా 20 ఏళ్ల తర్వాత వస్తుందని ఊహించినట్లు అల్లు అర్జున్ పేర్కొన్నారు. ముందుగానే వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :