ఆదితో ఢీ అంటే ఢీ అంటున్న అల్లు అర్జున్

ఆదితో ఢీ అంటే ఢీ అంటున్న అల్లు అర్జున్

Published on Nov 16, 2015 8:25 AM IST

Alli-arjun-aadi
ప్రేమకథ, కుటుంబ కథా చిత్రమ్ లేక ఓ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ఇలా ఏ సినిమాకి అయిన పర్ఫెక్ట్ గా సరిపోతాను అని నిరూపించుకున్న యాక్టర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఏడాది ‘S/O సత్యమూర్తి’ లాంటి ఓ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వార బన్ని చేస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘సరైనోడు(వర్కింగ్ టైటిల్)’. కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ మాస్ మసాలా మూవీస్ తీసే డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకుడు. నిన్నటి నుంచి ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరగనుందని ఇది వరకే తెలియజేశాం.

నిన్నటి నుంచి అల్లు అర్జున్, విలన్ గా కనిపించనున్న ఆది పినిశెట్టిలపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రేసలు కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. దాదాపు ఇప్పటికే 50% టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆదర్శ్ బాలకృష్ణలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లవ్, కామెడీ, యాక్షన్ తో పాటు ఫ్యామిలీ అంశాలను కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి బోయపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడని ఈ చిత్ర టీం చెబుతోంది.

తాజా వార్తలు