బన్నీ మరోసారి ఈ మాస్ దర్శకునితో..?

Published on May 13, 2021 7:04 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మన తెలుగులో కానీ ఇతర భాషల్లో కానీ అంత క్రేజ్ రావడానికి కారణంతో తన డ్రెస్సింగ్ అండ్ స్టైలిష్ లుక్స్ మరియు డాన్స్ అనే చెప్తారు అందరు. కానీ అదే స్టైలిష్ స్టార్ ని మాస్ లో ఊరమాస్ గా చూపించిన దర్శకుడు మాత్రం బోయపాటి శ్రీను అనే చెప్పాలి.

అప్పటి వరకు క్లాస్ మాస్ తో అలరించిన అల్లు అర్జున్ ని కంప్లీట్ మాస్ రోల్ లో చూపించి దర్శకుడు బోయపాటి శ్రీను సరికొత్త బన్నీ ని ప్రెజెంట్ చేసాడు. మరి ఈ మాస్ సెన్సేషనల్ కాంబోపై మళ్ళీ ఆసక్తికర బజ్ వినిపిస్తుంది. బహుశా ఈ కాంబో మళ్ళీ రిపీట్ కావచ్చని ఇప్పుడిప్పుడే ఊహాగానాలు మొదలవుతున్నాయి.

మరి ఇందులో ఎంత వరకు నిజముందో అన్నది కాలమే నిర్ణయించాలి. బన్నీ దర్శకుడు సుకుమార్ తో హ్యాట్రిక్ చిత్రం “పుష్ప”, బోయపాటి తన మరో మాస్ హీరో నందమూరి బాలకృష్ణతో తన హ్యాట్రిక్ చిత్రం “అఖండ” అనే మోస్ట్ అవైటెడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :