బన్నీతో కూతురు అర్హ ఆట..ఎంతో ముచ్చటగా.!

Published on Aug 11, 2021 11:00 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. మరి అలాగే ఇప్పుడు ఈ సినిమా షూట్ లో చిన్న బ్రేక్ ఉండగా బన్నీ తన సమయాన్ని కుటుంబంతో చాలా ప్లెజెంట్ గా గడుపుతున్నాడు. అయితే బన్నీ తన కూతురు అల్లు అర్హ లకి మధ్య ఎంత చక్కని అద్భుతమైన మూమెంట్స్ ఉన్నాయో తన భార్య స్నేహ ఇది వరకే చాలా సార్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అలానే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోనే వారిద్దరి మధ్య షూట్ చేసింది షేర్ చేశారు. వారి ఇంట్లో బన్నీ బబుల్ గన్ తో బబుల్స్ వదులుతుంటే వాటితో ఎంతో చక్కగా ఆడుకుంటున్న అల్లు అర్హని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.. దీనితో చూసిన బన్నీ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక అలాగే మరో రెండు రోజుల్లో రానున్న పుష్ప మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ కోసం కూడా ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :