ఈ ఇద్దరి హీరోల వెనుక చరణ్, బన్నీలు.!

Published on Sep 30, 2020 7:13 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇపుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలే మన టాలీవుడ్ కు చెందిన మరో యంగ్ హీరోల ఫ్యూచర్ ప్రాజెక్టులకు హెల్ప్ చేసారని చెప్పాలి. అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని హీరోగా టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డిల కాంబోలో ఒక జేమ్స్ బాండ్ తర్వాహ చిత్రం వస్తుంది అని తెలిసిందే.

అయితే ఈ ప్రాజెక్ట్ ను అఖిల్ తో చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేసినట్టుగా వార్తలొచ్చాయి. అలాగే లేటెస్ట్ గా మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ తో ఒక భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వడానికి వెనుకున్న కారణం బన్నీయే అని సినీ వర్గాల్లో టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ ఒకవేళ నిజం అయితే ఈ ఇద్దరు హీరోలు ఆ ఇద్దరి హీరోలకు మంచి హెల్ప్ చేసినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More