‘పడి పడి లేచె మనసు’ కోసం ప్రత్యేక అతిధిగా అల్లు అర్జున్ !

Published on Dec 15, 2018 11:23 pm IST

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా హైదరాబాద్ లోని శిల్పా కళా వేదికలో ఈ నెల 17న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిధిగా అల్లు అర్జున్ పాల్గొననున్నాడని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

కాగా ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్రం ఆల్బమ్ మంచి హిట్ అయింది. ఈ చిత్రం యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో ప్రేమలోని ఒక సరికొత్త కోణాన్ని తెర పై ఆవిష్కరించబోనుందట.

అలాగే ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీదే రాని ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఈ సినిమాలో ఉందని… ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.

సంబంధిత సమాచారం :