Allu Arjun: సూపర్ హీరోగా బన్నీ.. లోకేష్ ఒప్పించేసాడా!?

Allu Arjun: సూపర్ హీరోగా బన్నీ.. లోకేష్ ఒప్పించేసాడా!?

Published on Jan 4, 2026 12:00 AM IST

Allu Arjun

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా కోలీవుడ్ దర్శకుడు అట్లీతో భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఎలాంటి టైటిల్ ఖరారు కాని ఈ సినిమా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ లైనప్ లో మరింతమంది స్టార్స్ దర్శకుల పేర్లు ఉండగా కొంత కాలం నుంచి మాత్రం టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా కోసం కూడా వినిపిస్తుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా దాదాపు ఖరారు అయ్యినట్టు కొత్త వినికిడి.

Lokesh Kanagaraj Dream Project – లోకేష్ డ్రీం ప్రాజెక్ట్ బన్నీతో..

లోకేష్ కనగరాజ్ ఇప్పుడు వరకు చేసిన సినిమాలు కాకుండా తనకి ఓ డ్రీం ప్రాజెక్ట్ ఉంది. అదే ‘ఇరుంబు కై మాయావి’. దీని కోసం సూర్య, అమీర్ ఖాన్ తదితర స్టార్స్ పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా మళ్ళీ బన్నీ వద్దకే వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అప్డేట్ కూడా వస్తుందట.

Allu Arjun as Super Hero – సూపర్ హీరోగా అల్లు అర్జున్..

లోకేష్ సిద్ధం చేసుకున్న ఈ సబ్జెక్టులో హీరో పాత్రకి ఒక యాక్సిడెంట్ మూలాన వచ్చే సూపర్ పవర్స్ తో సాగుతుందట. హీరో ఎడమ చేతిని మెటల్ చేతితో మారుస్తారట. ఆ తర్వాత తనకి ఎలా సూపర్ పవర్స్ వచ్చాయి అనేది ఇందులో ప్రధాన అంశం అన్నట్టు కొన్ని థియరీలు ఉన్నాయి. మరి ఇదే నిజం అయితే ఇండియన్ సినిమా దగ్గర మరో క్రేజీ సూపర్ హీరో దొరికినట్టే అనుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు