శాకుంతలం సెట్స్ లో అల్లు అర్జున్…దేవ్ మోహన్ తో ఫొటోలు వైరల్!

Published on Aug 6, 2021 10:00 pm IST


గుణ శేఖర్ దర్శకత్వం లో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. అయితే ఈ చిత్రం లో ప్రిన్స్ భారత పాత్ర లో అల్లు అర్జున్ కూతురు అయిన అల్లు అర్హా నటిస్తుంది. అయితే తాజాగా శాకుంతలం సెట్స్ లోకి అల్లు అర్జున్ దర్శనం ఇచ్చారు. నటుడు దేవ్ మోహన్ తో అల్లు అర్జున్ దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దేవ్ మోహన్ శాకుంతలం చిత్రం లో దుష్యంత పాత్ర లో నటిస్తున్నారు.

అయితే దేవ్ మోహన్ అల్లు అర్జున్ ను కలవడం పై సంతోషం వ్యక్తం చేశారు. అయితే అల్లు అర్జున్ సైతం బ్లాక్ డ్రెస్ లో ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం లో పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ గా కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కానుంది. అయితే అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని దీపావళి కి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :