సన్నిహితులతో సెర్బియా లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నా ఐకాన్ స్టార్!

Published on Apr 8, 2022 6:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ను తన సన్నిహితుల తో సెలబ్రేట్ చేసుకున్నారు. తన 40 వ పుట్టిన రోజు ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అల్లు అర్జున్. తన సన్నిహితులలో 50 మందిని సెర్బియా లోని బెల్ గ్రేడ్ కి వెళ్లి వారితో పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ హృదయ పూర్వక ధన్యవాదాలు నోట్ ను కూడా షేర్ చేసుకోవడం జరిగింది.

అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడం తో ప్రేక్షకులు, అభిమానులు, సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, పలువురు ముఖ్యులు బన్నీ కి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. పుష్ప ది రైజ్ చిత్రం తో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ పుష్ప ది రూల్ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :