‘బన్నీ’ కొత్త మూవీ అప్ డేట్ !

Published on Aug 9, 2019 1:53 am IST

బోయపాటి – అల్లు అర్జున్ కాంబినేషన్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారం నుండి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా టాకీ పార్ట్ ను నవంబర్ కల్లా పూర్తి చేయనున్నారట.

ఇక గతంలో బోయపాటి – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ను అక్కడి జనాన్ని బాగా ఆకట్టుకుంది. మరి ఈ సారి కూడా వీరి కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. అయితే బోయపాటి – బాలయ్య సినిమా కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. కాకపోతే అల్లు అర్జున్ సినిమా తరువాత వచ్చే ఏడాది బాలయ్యతో సినిమా ఉంటుందట.

సంబంధిత సమాచారం :