తిత్లీ బాధితుల‌కు అల్లు అర్జున్ 25 లక్షలు విరాళం !

Published on Oct 20, 2018 3:19 pm IST

‘తిత్లీ’ బీభత్సం కారణంగా సిక్కోలులోని ప్రజలు గత కొని రోజులుగా తీవ్ర ఇబ్బందులతో అల్లాడిపోతుతున్న విషయం తెలిసిందే. వారి బాధకి తెలుగు సినీరంగ ప్రముఖులు తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ రూ.25 లక్షల పెద్ద మొత్తాన్ని విరాళంగా ప్రకటించి తిత్లీ బాధితుల‌కు అండగా నిలబడ్డారు. ఆయన ట్విటర్‌ లో స్పందిస్తూ.. ‘’తిత్లీ’ కారణంగా శ్రీకాకుళం ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులు విన్నాక నాకు చాలా బాధేసింది. ‘తిత్లీ’ తుపాను బాధితులకు రూ.25 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా‌. వారికి మనవంతు సహాయం చేద్దాం’ అని ట్వీట్ చేశారు.

కాగా ఇప్పటి వరకు సినీ రంగం నుండి నందమూరి బాలకృష్ణ 25 లక్షలు, ఎన్టీఆర్ రూ.15 లక్షలు, కల్యాణ్ రామ్ రూ.5 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు, సంపూర్ణేష్ బాబు 50 వేలు డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.లక్ష, కొరటాల శివ రూ.3 లక్షలను తిత్లీ బాధితుల‌కు సహాయార్ధం కొరకు విరాళాలు ప్రకటించి.. సిక్కోలులోని ప్రజలకు కష్టకాలంలో తోడుగా నిలబడ్డారు.

సంబంధిత సమాచారం :