అక్టోబర్ 18న బన్ని ‘గోన గన్నారెడ్డి’ ఫస్ట్ లుక్

అక్టోబర్ 18న బన్ని ‘గోన గన్నారెడ్డి’ ఫస్ట్ లుక్

Published on Oct 12, 2014 3:00 PM IST

allu-arjun1
భారీ బడ్జెట్ మరియు భారీ సెట్స్ స్పెషలిస్ట్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్ట మొదటి స్టీరియో స్కోపిక్ 3డి పీరియాడిక్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో కనిపించనున్న సంగతి మనందరికీ తెలిసిందే.

తాజాగా ఈ చిత్ర టీం ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర ఫస్ట్ లుక్ ని అక్టోబర్ 18న రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గ్రాండ్ గా ఓ ఈవెంట్ అరేంజ్ చేసి ఈ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయి.

అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు