ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఒక్క నార్త్ మార్కెట్ లోనే కాకుండా సౌత్ లో కూడా అల్లు అర్జున్ కి సాలిడ్ క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పక్కన పెడితే కేరళలో అల్లు అర్జున్ కి ఎప్పుడు నుంచో మంచి క్రేజ్ సొంతం. ఏ టాలీవుడ్ హీరోకి కూడా లేని విధంగా ఎన్నో ఏళ్ళు కితమే మల్లు ఇండస్ట్రీ వారు అల్లు అర్జున్ ని ఓన్ చేసుకున్నారు.
అందుకే బన్నీని వారు మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు. అయితే అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ సొంతం కావడంలో తన హ్యాపీ సినిమా అక్కడ ముఖ్య కారణం. మలయాళంలో ‘హ్యాపీ బి హ్యాపీ’ గా విడుదల అయ్యి హిట్ అయ్యిన ఈ సినిమా మరోసారి మోలీవుడ్ లో వైరల్ గా మారింది.
ఈ చిత్రం అక్కడ తాజాగా రీరిలీజ్ కాగా థియేటర్స్ లో రెస్పాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాకుండా గత 24 గంటల్లో ఒక్క మలయాళ వెర్షన్ కి 5 వేల టికెట్స్ కి పైగా సేల్ అయ్యాయి. దీనితో అక్కడ బన్నీ క్రేజ్ చూసి మన దగ్గర అల్లు అర్జున్ ఆర్మీ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



