కొరెంటైన్ లో కథలు వింటున్న బన్నీ

కొరెంటైన్ లో కథలు వింటున్న బన్నీ

Published on Jul 11, 2020 2:12 PM IST

Allu Arjun

కరోనా వైరస్ బన్నీకి మళ్ళీ గ్యాప్ వచ్చేలా చేసింది . ఆయన అల వైకుంఠపురంలో మూవీ విడుదల తరువాత ఏప్రిల్ నుండి పుష్ప షూటింగ్ మొదలుపెట్టాలనే ప్లాన్ లో ఉన్నారు. దర్శకుడు సుకుమార్ సైతం సెకండ్ షెడ్యూల్ కొరకు సర్వం సిద్ధం చేసి ఉంచారు. కేరళలో కొద్దిరోజులలో షూటింగ్ మొదలవుతుందనగా కరోనా కలకలం రేగింది. దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంలతో ప్రణాళికకు బ్రేక్ పడింది.

ప్రస్తుతం ప్రభుత్వాలు షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చినప్పటికీ వేగంగా వ్యాపిస్తున్న వైరస్ కి బయపడి ఎవరూ షూటింగ్స్ మొదలుపెట్టడం లేదు. ఇక బన్నీ సైతం ఇంటికే పరిమితం అవుతున్నారు. మరో రెండు మూడు నెలల సమయం షూటింగ్ కి పట్టేలా ఉండగా,బన్నీ ఖాళీ సమయంలో కథలు వింటూ గడుపుతున్నారని సమాచారం. యంగ్ డైరెక్టర్స్ చెప్పే స్టోరీ లైన్స్ వింటున్న బన్నీ, నచ్చితే భవిష్యత్ లో సినిమా చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారట. పుష్ప తరువాత బన్నీ,దర్శకుడు వేణు శ్రీరాంతో ఐకాన్ మూవీ చేయాల్సివుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు