వైరల్ అవుతున్న స్టైలిష్ “పుష్ప” రాజ్ పిక్స్.!

Published on Jul 8, 2021 2:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ స్టైలిష్ ఐకాన్ ఎవరన్నా ఉన్నారంటే అది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. తనదైన హెయిర్ స్టైల్స్ డ్రెస్సింగ్స్ తో టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఇంపాక్ట్ సెట్ చేసిన అల్లు అర్జున్ తన లేటెస్ట్ అండ్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” కి ఊహించని డీ గ్లామరస్ లుక్ ని సిద్ధం చేసి ఆశ్చర్య పరిచాడు. అయితే మరి ఇదే లుక్ లో స్టైలిష్ గా ఇప్పుడు దర్శనం ఇచ్చి వైరల్ అవుతున్నాడు.

అదే పుష్ప లుక్ లో గడ్డంతో కాకపోతే మంచి స్టైలిష్ గా ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. దీనితో ఈ ఫొటోస్ బన్నీ అభిమానులు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప చిత్రంలో బన్నీ సరసన రశ్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :