మొన్న ఎన్టీఆర్ నేడు బన్నీ..!

Published on Feb 26, 2020 10:00 am IST

టాలీవుడ్ దర్శకులు మరియు హీరోలు మునుపటిలా లేరు. పాత్రలో పర్ఫెక్షన్ కొరకు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారు. అలాగే పాత్రకు తగ్గ ఆహార్యంతో పాటు భాషను కూడా వదలడం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో రాయలసీమ యువకుడి పాత్ర చేశాడు. ఈ పాత్ర కోసం రాయలసీమ యాసను ఆయన అవపోసన పట్టారు. రాయలసీమకు చెందిన లిరిక్స్ రైటర్ పెంచల్ దాస్ పర్యవేక్షణలో ఆయన శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది.

ఇప్పుడు సుకుమార్ చిత్రం కోసం బన్నీ కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిత్తూర్ ప్రాంతంలోని శేషాచలం అడవులలో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక బన్నీ మాస్ చిత్తూరు ప్రాంత యువకుడిగా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం చిత్తూరు యాస నేర్చుకోవడానికి ఓ శిక్షకుడిని పెట్టుకున్నారు. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.

సంబంధిత సమాచారం :