ఐకాన్ ఆలస్యమైతే.. బోయపాటితో మొదలెట్టనున్న బన్నీ..!

Published on Sep 3, 2021 3:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప” సినిమాలో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటిస్తాడన్నది ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. దర్శకుడు బోయపాటి శ్రీను ఎప్పటినుంచో అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

అయితే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసే “ఐకాన్” సినిమా పట్టాలెక్కకపోతే బోయపాటి సినిమాను ముందు మొదలుపెట్టనున్నారట. అయితే ఇది కేవలం “ఐకాన్” సినిమా మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే బోయపాటి శ్రీను-అల్లు అర్జున్ కాంబినేష్‌లో విడుదలైన “సరైనోడు” సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :