ఆగష్టునుండి అల్లు అర్జున్ కొత్త చిత్రం ప్రారంభం ?

Published on Jul 2, 2018 11:50 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ‘నా పేరు సూర్య నా ఇల్లు’ ఇండియా చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం బన్నీకి విజయాన్ని అందించలేకపోయింది . ఇక ఈచిత్రం విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు . అయితే మనం చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ చెప్పిన కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గత కొన్నిరోజులు గా వార్తలు వచ్చాయి .

ఇప్పుడు ఎట్టకేలకు బన్నీ ,విక్రమ్ కుమార్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడట. గీత ఆర్ట్స్ బేనర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగష్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలుబడే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం :