ఆ హీరో బహుమతి బన్నీని ఫిదా చేసింది.

Published on Jan 11, 2020 2:36 pm IST

తన బహుమతితో విజయ్ దేవరకొండ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఫిదా చేశారు. ఆ బహుమతికి స్పందనగా బన్నీ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. విషయంలోకి వెళితే విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రౌడీ బ్రాండ్ కి సంబంధించి బట్టలు బన్నీకి బహుమతిగా పంపించారు. ఆ బహుమతి అందుకున్న బన్నీ… ‘చెప్పిన విధంగా నూతన దుస్తులు పంపినందుకు ధన్యవాదాలు మై డియర్ బ్రదర్, రేపు అల వైకుంఠపురంలో విజయోత్సవ వేడుకలో నేను ఈ బట్టలే వేసుకుంటాను’ అని ట్వీట్ చేశారు. బన్నీ ట్వీట్ చూసిన వారెవరైనా విజయ్ పంపిన రౌడీ బ్రాండ్ బట్టలు ఆయనకు అంతగా నచ్చాయా అని అనిపించక మానదు.

ఇక అల వైకుంఠపురంలో మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా..టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక రోల్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :