ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ ఇటీవల జపాన్ దేశంలో గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ఆ దేశంలో ప్రమోట్ చేసేందుకు హీరో సహా, రష్మిక మందన్న, చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లారు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానితో పాటు జపాన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ జీక్ పిక్చర్స్ ఎగ్జిక్యూటివ్స్‌తో కూడా అల్లు అర్జున్ ఫోటోలు దిగాడు.
ఇక అల్లు అర్జున్ త్వరలోనే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న AA22 చిత్ర షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించనుంది. సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు.


