ఒక లెక్కలో అంచనాలు పెంచుతున్న బన్నీ..!

Published on Aug 12, 2021 7:04 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో అంచనాలు క్రమక్రమంగా పెంచుతూ వెళ్తుంది. అయితే బన్నీ ని అసలు ఎన్నడూ లేని విధంగా మీరు చూస్తారని సుకుమార్ ఇది వరకే చెప్పారు.. కానీ నిన్నటితో మాత్రం ఒక క్లారిటీ ప్రతి ఒక్కరికీ చాలా సుస్పష్టంగా బన్నీ ఇచ్చాడని చెప్పాలి.

పుష్ప రాజ్ అనే పాత్రలో ఎంతలా ఇమిడిపోయాడో చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది.. అయితే ఎలాంటి రోల్ లో అయినా ఎలాంటి భాషా మాండలికాన్ని అయినా చాలా ఈజ్ గా పలికించగలిగే అతి తక్కువ మంది నటుల్లో బన్నీ కూడా ఒకడు. ఆ రకంగా పుష్ప నుంచి మరో లెవెల్ యాటిట్యూడ్ కనిపించేలా ఉండనిపిస్తుంది.. దీనితో పుష్ప పై చాలా ఆసక్తిని జెనరల్ ఆడియెన్స్ లో బన్నీ పెంచేసాడు.. మరి సినిమా కూడా నో డౌట్ గా ఉంటే మాత్రం బన్నీ మాస్ రేజ్ ని బలంగా చూడొచ్చని చెప్పొచ్చు.. ఇక ఈ చిత్రంకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :