“పుష్ప 2” లో మరింత సాలిడ్ గా బన్నీ రోల్.?

Published on Jul 13, 2021 10:08 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా ఓ లెవెల్లో నిలబెట్టనున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. బన్నీ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే స్పెషల్ గా అయితే బన్నీ,సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ల హ్యాట్రిక్ కాంబో అని మన దగ్గర మరో స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదట ఈ సినిమాను ఒక్క పార్ట్ గానే ప్లాన్ చేసినా తర్వాత దానికున్న స్పాన్ నిమిత్తం రెండు భాగాలుగా విడిపోయింది.

మరి ఇందులో కనపడనున్న బన్నీ రోల్ పై ఆసక్తికర టాక్ వినపడుతుంది. ఈ చిత్రంలో పుష్ప రాజ్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. అలాగే స్ట్రాంగ్ ఎమోషన్స్ తో బన్నీ పాత్ర నెగిటివ్ షేడ్ ను కూడా కనబరుస్తుంది అని తెలుస్తుంది. అలాగే బన్నీ నటనలో కూడా చాలా పరిణితి కనిపిస్తుందట. ఇదేదో కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :