“పుష్ప” షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే.!

Published on Jul 6, 2021 10:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా అప్ గ్రేడ్ చేస్తున్న లేటెస్ట్ అండ్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం లాక్ డౌన్ 2.0 వల్ల షూట్ కొన్నాళ్ళు నిలిపివేశారు.

మరి లేటెస్ట్ అప్డేట్ ఈ చిత్రం షూట్ పై వచ్చింది. ఈరోజు నుంచే ఈ చిత్రం షూట్ హైదరాబాద్ లో మొదలయ్యిందట. బన్నీ కూడా పాల్గొన్న ఈ షూట్ నేటి నుంచి మొత్తం 45 రోజులు పాటు నిర్విరామంగా జరుపుకోనుందట. దీనితో పుష్ప పార్ట్ 1 అంతా కంప్లీట్ అయ్యిపోయినట్టే అట.

మరి ఈ సినిమా అనంతరం సరికొత్త మేకోవర్ తో బన్నీ “ఐకాన్” ను స్టార్ట్ చేసేయనున్నాడు. ఇక పుష్ప చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :