అనుకున్న దానికంటే ఎక్కువగానే “పుష్ప”.?

Published on Jan 22, 2021 2:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు నార్త్ ఆడియెన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా చేయనప్పటికీ బన్నీ సినిమాలను భారీ స్థాయిలో చూస్తారు. అందుకే మొట్ట మొదటి సారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. తన ఆల్ టైం హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో ప్లాన్ చేసిన ఈ భారీ చిత్రంపై అంతే స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాను మేకర్స్ మొత్తం ఐదు భాషల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం మరియు హిందీ భాషల్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అనుకున్న దాని కంటే మరిన్ని భాషల్లో కూడా విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బన్నీ సినిమాలకు మన పక్క దేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది.

మరి బహుశా మన దేశంలోని ఇతర భాషలతో పాటు వాటిలో కూడా విడుదల చేస్తారేమో చూడాలి. ఇక ఈ సాలిడ్ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు/

సంబంధిత సమాచారం :

More