బన్నీ బాలీవుడ్ ప్రస్థానం గట్టిగా ఉండనుందా.?

Published on Aug 27, 2020 7:04 am IST

బాహుబలితో మన తెలుగు హీరో అడుగు బాలీవుడ్ లో పడి అది ఇంకా పెద్దది అయ్యింది. దీనితో అక్కడ నుంచి మన ఇతర స్టార్ హీరోలు కూడా బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. అయితే నార్త్ ఆడియెన్స్ లో ప్రభాస్ తో పాటుగా మంచి గుర్తింపు ఉన్న మరో మన టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒక్క మంది దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎప్పుడో పాగా వేసిన బన్నీ సరైన సమయం కోసం ఎదురు చూసాడు.

ఇక ఎలాగో మన హీరోల ప్రభావం అక్కడ గట్టిగా పడే సరికి తాను కూడా పాన్ ఇండియన్ ఎంట్రీకి రెడీ అయ్యారు. ఇదిలా ఉండగా బన్నీ ఇప్పుడు రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాలతో బాలీవుడ్ లో పునాది వేస్తుండగా అక్కడి కొన్ని బడా నిర్మాణ సంస్థలు కూడా బన్నీ తో సినిమా చేసేందుకు ముందుకు వస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే అక్కడ కూడా బన్నీ ప్రస్థానం ఖచ్చితంగా గట్టిగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :