డియరెస్ట్ డీఎస్పీ కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన బన్నీ.!

Published on Jul 8, 2021 10:01 am IST

మన టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ప్రతీ హీరోకి కూడా ఎలాంటి ఆల్బమ్స్ ఇచ్చాడో మనం చూసాము. ఇక వారిలో ప్రతి ఒక్కరితో కూడా స్పెషల్ క్రేజ్ ను కూడా తెచ్చుకున్నాడు. అయితే కొన్ని ఎవర్ గ్రీన్ కాంబోస్ లో మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు దేవి కాంబో కూడా ఒకటి.

వీరి నుంచి వచ్చిన ప్రతీ మ్యూజిక్ ఆల్బమ్ కూడా పెద్ద చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఆర్య నుంచి సన్నాఫ్ సత్యమూర్తి వరకు కూడా ప్రతిదీ వీరి నుంచి స్పెషల్ ఆల్బమ్ నే.. అందుకే వారి మధ్య స్నేహ బంధం కూడా అంతే గట్టిగా ఏర్పడింది. మరి దానికి ప్రతీకగా బన్నీ డియరెస్ట్ డీఎస్పీ కి ఒక స్పెషల్ గిఫ్ట్ పంపి ఆశ్చర్యపరిచాడు.

దీనితో అది చూసి దేవి ఎగ్జైట్ అయ్యి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకొని ఐకాన్ స్టార్ కి థాంక్స్ చెప్పాడు. మరి సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూడండి.. ప్రస్తుతం అయితే వీరి కాంబో నుంచి “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియోపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :