ఆఫ్ లైన్లో కూడా స్టైలిష్ లుక్స్ తో స్టన్ చేస్తున్న బన్నీ.!

Published on Sep 22, 2020 1:55 pm IST

మన టాలీవుడ్ లో తనదైన స్టైలిష్ లుక్స్, డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ ఇలా అన్ని అంశాల్లో కేరాఫ్ అడ్రెస్ గా మారి స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఒక్క సినిమాల్లోనే కాకుండా ఆఫ్ లైన్ లో సింపుల్ గా ఉండి కూడా స్టైలిష్ గా కనిపించడం బన్నీకే చెల్లుతుందని చెప్పాలి. ప్రస్తుతం తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప” కోసం ప్రిపేర్ చేసిన రఫ్ లుక్ తో ఆకట్టుకున్నారు.

అయితే ఇపుడు గ్యాప్ రావడంతో అదే లుక్ ను మైంటైన్ చేస్తూ వచ్చిన బన్నీ ఇప్పుడు బయటకు కూడా వస్తున్నారు. అలా ఈ మధ్య పలు సందర్భాల్లో బయటకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఆ ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అలా ఇప్పుడు మరోసారి లేటెస్ట్ లుక్స్ బయటకొచ్చాయి. టోటల్ బ్లాక్ అండ్ బ్లాక్సింపుల్ కాస్ట్యూమ్స్ తో కూడా బన్నీ అల్ట్రా స్టైలిష్ గా కనిపించారు. దీనితో ఈ లుక్స్ ఇపుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More