పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప’ ఫ్రాంచైజీతో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, ఈ రెండు సినిమాల కోసం దాదాపు ఆరేళ్ల విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు కూడా అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ సమయమే పడుతోంది. దీంతో తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో టైమ్ మేనేజ్మెంట్పై బన్నీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సమయం విలువను గుర్తించిన ఆయన, ఇకపై వేగంగా సినిమాలు పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.
ఈ క్రమంలోనే అనుకున్న సమయంలో భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో దిట్టలైన లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్ వంటి ప్రతిభావంతులైన దర్శకులతో అల్లు అర్జున్ జతకట్టనున్నాడు. ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి, ఏడాది లోపు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో లోకేష్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉండగా, బాసిల్ జోసెఫ్ కూడా అంతే వేగంగా సినిమాలను తెరకెక్కిస్తాడు. 2027లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా బన్నీ వరుసగా ప్రేక్షకులను పలకరించడం ఖాయంగా కనిపిస్తోంది.


