లేటెస్ట్..మరో భారీ ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యబోతున్న అల్లు అర్జున్.?

Published on Jul 1, 2021 11:50 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికి సిద్ధం అయ్యిపోయాడు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఆడియెన్స్ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బన్నీ మంచి ఫాలోయింగ్ ను సంతరించుకున్నాడు. మరి ఎట్టకేలకు ఇప్పుడు అందరినీ ఒకేసారి పలకరించాలని తన లేటెస్ట్ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ “పుష్ప” తో సన్నద్ధం అవుతున్నాడు.

ఇక దీని తర్వాత నుంచి కూడా అన్నీ పాన్ ఇండియన్ లెవెల్లోనే తెరకెక్కనున్నాయని బజ్ కూడా ఉంది. అయితే బన్నీ లైనప్ పై ఓ ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. కోలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత ఎస్ థాను బ్యానర్ లో బన్నీ ఓ చిత్రం చెయ్యనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వారి వారి బ్యానర్ లో “తుపాకి”, “అసురన్”, “తేరి” లాంటి భారీ హిట్ చిత్రాలు ఉన్నాయి.

మరి వారికే బన్నీ సైన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం కూడా ఓ స్టార్ తమిళ్ దర్శకునితోనే ఉంటుందని కూడా టాక్.. దీనిపై అధికారిక అప్డేట్ కూడా తొందరలోనే రానుందట. అయితే ఎప్పుడు నుంచో బన్నీ మరియు ఏ ఆర్ మురుగదాస్ కాంబోపై టాక్ ఉంది. మరి అది ఇదేనా లేక కొత్త ప్రాజెక్ట్ నా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :