క్లైమాక్స్ చిత్రీకరణలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’..!

Trivikram-alluarjun1

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’. టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. కోకాపేటలో వేసిన ఇంటి సెట్‌ లో ప్రధాన తారాగణమంతా పాల్గొనగా, కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో పూర్తి కానున్న ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు. ఏకకాలంలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో సమంత, నిత్య మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వేసవి ప్రధమార్ధంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version