బన్నీ మేకోవర్ పూర్తయ్యింది కానీ..!

బన్నీ మేకోవర్ పూర్తయ్యింది కానీ..!

Published on Mar 29, 2020 5:31 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అగ్రదేశం అమెరికాలో దీని ప్రభావం ప్రమాదకర స్థాయికి చేరింది. అమెరికాలో రోగుల సంఖ్య లక్ష దాటిపోవడం గమనార్హం. ఇక ఇండియాలో కూడా రోజు రోజుకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. భారత్ 21 రోజుల వరకు టోటల్ లాక్ డౌన్ ప్రకటిచడంతో చిత్ర పరిశ్రమకు కూడా తాత్కాలిక బ్రేక్ పడింది. దీనితో అన్ని చిత్రాల షూటింగ్స్ నిలిపివేయడం జరిగింది.

హీరో బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తుండగా ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. ఈ చిత్రంలోని మాస్ లుక్ కొరకు గత కొన్ని నెలలుగా బన్నీ జుట్టు మరియుగడ్డం పెంచుతున్నారు. ఈ పాత్ర కోసం బన్నీ మేకోవర్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ మొదలుకావడం లేదు. ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేయగా, అక్కడ ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరో లొకేషన్ కొరకు ఎదురుచూస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు