బిగ్ స్క్రీన్‌పైకి అల్లు అర్జున్ కూతురు?

Published on Jul 10, 2021 1:51 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ గురుంచి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో, చిట్టి చేష్టలతో ఎంతో యాక్టివ్‌గా, స్టైలిష్‌గా కనిపించే ఈ క్యూటీ త్వరలోనే బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే అది కూడా దిల్‌రాజు వంటి స్టార్ నిర్మాత సినిమాలో చేయబోతుందని టాక్.

అయితే చిన్న అమ్మాయి చుట్టూ సాగే ఓ కథ ద్వారా సురేశ్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ కథకు అల్లు అర్హా సెట్ అవుతుందని, అల్లు ఫ్యామిలీనీ ఒప్పించి అర్హను సినిమాలోకి తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికి ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కాసేపు పక్కన పెడితే ఇంత చిన్న వయసులో అల్లు అర్హ బిగ్ స్క్రీన్ ఎంట్రీకి అల్లు అర్జున్ మరియు కుటుంబసభ్యులు అంగీకరిస్తారా అన్నది కూడా కాస్త ఆలోచించదగ్గ విషయమే.

సంబంధిత సమాచారం :