10 సంవత్సరాలుగా నేను ఎదురుచూస్తున్న అవాకాశం ఇప్పుడొచ్చింది – అల్లు అర్జున్

allu-arjun
మెగా కుటుంబం నుండి తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి శ్రమతో, వినయంతో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన హీరో అల్లు అర్జున్ తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి చెప్పిన కథ నచ్చడంతో బన్నీ ఆయనతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజే చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తారు. ఈ ప్రాజెక్టును ‘స్టూడియో గ్రీన్’ నిర్మాణ సంస్థ నిర్మించనుంది.

ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ ‘పుట్టి, పెరిగిన ఊరిలో అనుకున్నది సాధించడంలో ఉన్న కిక్కే వేరు. అలాంటి సంతోషమే నాకిప్పుడు కలుగుతోంది. నేను పదేళ్లుగా ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పడొచ్చింది. ఈ అవకాశమిచ్చిన లింగుస్వామి గారికి నా కృతజ్ఞతలు. నా భాద్యతలు తీసుకుని నన్ను లాంచ్ చేస్తున్న స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ గారికి కృతజ్ఞతలు. అలాగే మంచి సపోర్ట్ ఇస్తున్న తమిళ మీడియాకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను’ అంటూ స్పీచ్ మొత్తం తమిళంలోనే మాట్లాడి తమిళుల మనసు గెలుచుకున్నారు. ఇకపోతే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

అల్లు అర్జున్ స్పీచ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి