అల్లు శిరీష్ మెడకు గాయం..!

Published on Jul 10, 2021 12:36 am IST


యంగ్ హీరో అల్లు శిరీష్ మెడకు గాయమయ్యింది. ఈ మధ్య ఫిట్‌నెస్ మీద ఎక్కువగా దృష్టి సారించిన ఈ అల్లు హీరో క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తున్నాడు. అయితే వర్కౌట్స్ చేసే సమయంలోనే మెడకు గాయం అయినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

అయితే మెడకు పట్టుకుని ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసిన అల్లు శిరీష్ ఇది ఫ్యాషన్ కోసం పెట్టుకోలేదని, స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నప్పుడు మెడకు గాయం అయ్యిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇది చూసిన అభిమానులు అల్లు శిరీష్‌కి త్వరగా గాయం నయమవ్వాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు శిరీష్ రాకేశ్‌ శశి దర్శకత్వంలో “ప్రేమ కాదంట” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :