ఒక సినిమా.. ఇద్దరి ఫేట్‌ను మారుస్తుందా ?

Published on May 16, 2019 2:17 pm IST

రేపు శుక్రవారం విడుదలకానున్న చిత్రాల్లో ‘ఏబిసిడి’ ఒకటి. ఇందులో హీరో హీరోయిన్లుగా నటించిన అల్లు శిరీష్, రుక్సార్ దిల్లోన్ ఇద్దరి భవిష్యత్తు ఈ సినిమా మీదే ఆధారపడి ఉంది. 2017లోనే తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రుక్సార్ ఇప్పటి వరకు సాలిడ్ హిట్ చూడలేదు. ఆమె చేసిన రెండు సినిమాలు ‘ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం’ రెండూ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ఆమె కెరీర్ ఇంకా ఆరంభం అన్నట్టే ఉంది. అందుకే రేపు రాబోయే ‘ఏబిసిడి’ హిట్టైతే తన ఫేట్ మారుతుందని ఆశపడుతోంది ఈ పంజాబీ అమ్మాయి.

ఇక అల్లు శిరీష్ విషయానికొస్తే 2016లో వచ్చిన ‘శ్రీరస్తు శుభమస్తు’ తరవాత చెప్పుకోదగిన హిట్ ఆయన ఖాతాలో పడలేదు. ఏడాదిన్నర క్రితం చేసిన ‘ఒక్క క్షణం’ కూడా అంతతంతమాత్రమే అనిపించుకుంది. దీంతో అల్లువారి అబ్బాయికి కూడా ‘ఏబిసిడి’ సక్సెస్ చాలా ముఖ్యమైంది. మరి చూడాలి విజయం కోసం తపిస్తున్న ఈ ఇద్దరి ఫేట్‌ను మంచి పాజిటివ్ బజ్ నడుమ వస్తున్న ‘ఏబిసిడి’ ఎలాంటి మలుపు తిప్పుతుందో.

సంబంధిత సమాచారం :

More