నెక్స్ట్ మూవీ కోసం బాడీ పెంచుతున్న అల్లు శిరీష్

Allu-Sirish
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ నటించిన మొదటి సినిమా ‘గౌరవం’ పరాజయం పాలైంది. కానీ ఆ తర్వాత మారుతి డైరెక్షన్ లో చేసిన ‘కొత్త జంట’ సినిమాతో మెగా అభిమానులని మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద నిర్మాతలకి లాభాలని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత అల్లు శిరీష్ బాగా సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటున్నాడు. కొత్త జంట రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా ఇప్పటికీ తన తదుపరి సినిమా గురించి అనౌన్స్ మెంట్ రాలేదు.

తాజా సమాచారం ప్రకారం అల్లు శిరీష్ తదుపరి సినిమా పరశురాం డైరెక్షన్ లో ఉంటుంది. పరశురాం గతంలో యువత, సోలో, సారొచ్చారు లాంటి సినిమాలను డైరెక్ట్ చేసాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు శిరీష్ తన తదుపరి సినిమా కోసం జిమ్ లో ఫుల్ వర్కౌట్ చేస్తున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే అల్లు శిరీష్ యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ తదుపరి సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనుంది.

Exit mobile version