త్వరలో మొదలుకానున్న అల్లు శిరీష్ సినిమా !
Published on May 30, 2018 8:47 am IST

యువ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం ‘ఏబిసిడి’ తెలుగు రీమేక్ కోసం సంసిద్దమవుతున్నారు . నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం ఏబిసిడి (అమెరికా బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) చిత్రానికి తెలుగు రీమేక్ గా రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

ఈ సినిమాకు కన్నడ కంపోజర్ జుడా శాండీ సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ సంగీత దర్శకుడ్ని అల్లు శిరీష్ ఏరి కోరి ఎంచుకోవడం విశేషం. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయకిగా ఎవరు నటించనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే అల్లు సైరెన్స్ తమిళంలో సూర్య, మోహన్ లాల్ కలిసి చేస్తున్న చిత్రంలో కూడ ఒక కీలక పాత్ర చేయనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook