నెలాఖరు నుండి షూటింగ్ మొదలుపెట్టనున్న శిరీష్ !

allu sirish
మెగా హీరో అల్లు శిరీష్ ఎన్నో రోజులుగా అనుకుంటున్న తన సైంటిఫిక్ థ్రిల్లర్ ను నిన్న పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విఐ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇకపోతే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఏప్రిల్ 24వ తేదీన మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఈ చిత్రంలో శిరీష్ సరసన సురభి హీరోయిన్ గా నటిస్తుండగా శీరత్ కపూర్, నటుడు, దర్శకుడు అయిన శ్రీనివాస్ అవసరాల పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న శిరీష్ ఈ ఏడాది కూడా ఆ తరహా విజయాన్నే రిపీట్ చేయాలని కాస్త భిన్నంగా సైంటిఫిక్ థ్రిల్లర్ జానర్ ను ఎంచుకున్నాడు.

Exit mobile version