ప్రభాస్ కు ఆల్ మోస్ట్ విలన్ అతడేనా..కారణం ఇదేనేమో?

Published on Jan 22, 2021 12:03 pm IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. “రాధే శ్యామ్” లాంటి క్లీన్ లవ్ స్టోరీ తర్వాత వస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై దాని కన్నా ఎక్కువ అంచనాలే నెలకొన్నాయి. మరి అలాగే ఈ చిత్రానికి గాను ఇప్పుడు మరింత సమాచారం బయటకు వస్తుంది.

అలా సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ కు గాను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పేరు అండర్ లోకి వచ్చి మంచి హాట్ టాపిక్ గా నిలిచింది.ఆల్ మోస్ట్ అతడే కన్ఫర్మ్ అని అంటున్నా ఇదే రోల్ కు ఇంతకు ముందు బాలీవుడ్ స్టార్ హీరో అబ్రహం పేరు వినిపించింది. కానీ ఇప్పుడు సేతుపతి పేరు వినిపించడానికి కారణం తాను చేసిన లేటెస్ట్ సినిమా “మాస్టర్” కారణమా అనిపిస్తుంది.

ఈ సినిమాలో సేతుపతి చేసిన విలన్ రోల్ కానీ అందులో తాను ఇచ్చిన అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్స్ ను స్టన్ చేసాయి. అంతే కాకుండా పాన్ ఇండియన్ లెవెల్లో ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. మరి బహుశా సేతుపతిని తీసుకొని ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మాత్రం దీనిపై అధికారిక అప్డేట్ వచ్చే వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :

More