బన్నీ మూవీలో ఎమోషన్స్ సే కాదు, ఫైటింగ్స్ కూడా ఒకరేంజ్ లో ఉంటాయట

బన్నీ మూవీలో ఎమోషన్స్ సే కాదు, ఫైటింగ్స్ కూడా ఒకరేంజ్ లో ఉంటాయట

Published on Oct 19, 2019 5:34 PM IST

బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తున్న మూడవ చిత్రం అల వైకుంఠపురంలో. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. పూజా హెగ్డే బన్నీ సరసన మరో మారు ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండి, సాంగ్ వరకు అన్నీ చిత్రంపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి. గతంలో త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించాయి. హిట్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో నిర్మాతలు విజయంపై ధీమాగా ఉన్నారు.

కాగా ఫ్యామిలీ ఎమోషన్స్ మెయిన్ ప్లాట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పోరాటాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. అల వైకుంఠపురంలో మొత్తంగా ఐదు నుండి ఆరు పోరాట సన్నివేశాల వరకూ ఉంటాయని సమాచారం. దసరా కానుకగా విడుదల చేసిన ప్రత్యేకమైన పోస్టర్ లో బన్నీ క్రీడా మైదానంలో రౌడీ గ్యాంగ్ బొక్కలు విరగొడుతున్న పోస్టర్ విడుదల చేయడం జరిగింది. టబు, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు